'యోగా' డే

ప్రపంచమంతా 2015 నుంచి యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది. అయితే ఈసారి దాదాపు 192 దేశాల్లో ప్రజలు ప్రాణాయామం చేస్తూ, శ్వాస పై ధ్యాస పెడుతున్నారు. వాస్తవానికి ఈ మన యోగా ఎప్పుడో లోకాన్ని చుట్టి వచ్చింది. 1950లోనే మార్టిన్ మనోలాంటి ఒక సూపర్ డూపర్ పాపులర్ హాలీవుడ్ హీరోయిన్ కూడా యోగాకు బెండ్ అయ్యిందట. అయితే ఆరోగ్యానికీ, మానసిక శ్రేయస్సుకీ సమగ్రమైన విధానం ఈ ప్రాచీన భారతీయ యోగశాస్త్ర విజ్ఞానమేనని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది.


| ప్రాచీనమైన యోగ విద్యకు భారతదేశం పుట్టినిల్లు విద్య ఎప్పుడు పుట్టిందనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ గాని, సింధూలోయ నాగరికత నాటికే ఉనికిలో ఉండేదని చరిత్రకారుల అంచనా, క్రీస్తు పూర్వం 500-2000 సంవత్సరాల మధ్యకాలంలో హిందువులతో పాటు జైనులు, బౌదులు కూడా సాధన చేసేవారు. ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలిస్తే రుగ్వేదంలో తొలిసారిగా 'యోగ' గురించిన ప్రస్తావన ఉంది. తర్వాత భగవద్గీతలోను, మహాభారతంలోని శాంతిపర్వంలోను, ' ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుశకం నాలుగవ శతాబ్దికి చెందిన పతంజలి మహర్షి యోగసూత్రాలు రచించిన తర్వాత విద్య విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రాచీన కాలంలో మోక్షగాములైన ముముక్షువులే ఎక్కువగా యోగసాధన చేసేవారు. వారు కూడ భక్తి, ధ్యాన యోగాల్లోనే నిమగ్నమయ్యేవారు.


శారీరక ధారుఢ్యానికి, శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి కోసం కూడా యోగసాధన సామాన్యులకు సైతం ఉపయోగపడుతుందని చరకుడు తొలిసారిగా తన చరక సంహితలో చాటాడు. మనసును నియంత్రించుకోవడమే, మనసు కళ్ళెంలేని గుర్రం లాంటిది. అదుపు చేసే సాధనమేదీ లేకపోతే దీశారహితంగా ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉంటాయి.పతంజలి మహర్షి నిర్వచనం ప్రకారం 'యోగ' చిత్తవృత్తి నిరోధ:” అంటే మనసును నియంత్రణలోనికి తెచ్చుకునే నైపుణ్యమే యోగ విద్య. ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆయన యోగ సూత్రాలను రచించాడు. ఈ సూత్రాలలో యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధాన్య, సమాధి మార్గాలను బోధించాడు. ఆధునిక కాలంలో యోగవిద్య ఎన్నెన్ని కొత్త కొత్త పోకడలు పోతున్నా, పతంజలి రచించిన యోగసూత్రాలే వాటన్నిటికి మూలాధారం. పతంజలి మొదలుకొని భారతదేశంలో చాలామంది గురువులు ఈ విద్యను వ్యాప్తిలోకి తెచ్చారు.. స్వామీ వివేకానంద అమెరికా పర్యటన దరిమిలా, ఈ విద్యకు పాశ్చాత్య దేశాల్లోనూ విశేష ప్రాచుర్యం లభించింది. మహావతార్ బాబా



శిష్యపరంపరకు చెందిన పరమహంస యోగానంద కూడా పాశ్చాత్య దేశాల్లో యోగవిద్యకు ప్రాచుర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆధునిక కాలంలో తిరుమలై కృష్ణమాచార్య యోగ విద్యకు పునరుత్తేజం కల్పించి, ఆధునిక యోగ పితామహుడుగా ఖ్యాతి పొందారు. మైసూరు మహారాజు ఆశ్రయం పొందిన తిరుమలై కృష్ణమాచార్య ఆరోగ్య వృద్ధి కోసం యోగసాధన ఆవశ్యకతను సామాన్యులకు వివరిస్తూ, హఠయోగ సాధన పద్దతులను బోధిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి, ఈ విద్యను జనసామాన్యానికి చేరువ చేశారు. కృష్ణమాచార్య శిష్యుడైన బి. కె. ఎన్. అయ్యంగార్ పతంజలి యోగా సూత్రాలను సులభతరమైన రీతిలో జనానికి బోధించారు. ఆయన రచించిన “లైట్ ఆన్ యోగా' పుస్తకం 19 భాషల్లో అనువాదమై, 30 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. యోగా ఎలాబడితే అలా చేస్తే ఫలితాలు సూన్యం, యోగా చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి.


యోగా చేసేముందు పాటించాల్సినవి :


- ఎప్పుడు చేసినా కాళీ కడుపుతోనే చేయాలి. లేదా స్వల్పాహారం తీసుకున్నా పర్వాలేదు. కడుపు నిండా మాత్రం తినకూడదు. - యోగాసనాలు మొదలుపెట్టబోయే ముందు ప్రశాంత చిత్తం కోసం ముందుగా ప్రార్థన చేయడం రివాజు.. - ఒక చాప లేదా జంపఖానా పరుచుకుని యోగాసనాలు చేయాలి.


యోగా చేసిన తర్వాత పాటించవలసినవి :


- చివరలో ధ్యానం చేస్తూ, యోగ శిక్షణను ముగించాలి. - దేహాన్ని వీలైనంత వదులుగా ఉంచుకోవాలి, అస్సలు బిగుతుగా ఉంచుకోకూడదు. - యోగసాధన పూర్తయ్యాక 20 నుంచి 30 నిమిషాల తర్వాతనే స్నానం చేయాలి. - యోగా చేశాక దాదాపు 20 - 30 నిమిషాల విరామం తరువాతే ఏదైనా ఆహారం తీసుకోవాలి. - అయితే ఎవరికి వారు తమ వ్యక్తిగత శారీరక సామర్థ్యానికి తగ్గట్లే యోగా చేయాలి.


యోగా ఎలాంటి వారు చేయాలి - ఎలా చేయాలి :


- యోగాసనాలు వేస్తున్నప్పుడు వదులుగా, సౌకర్యవంతంగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. -


ఉండే నూలు దుస్తులు ధరించాలి- - బాగా అలసటగా . వున్నప్పుడు ఆన నాలు . వేయకూడదు. - మనస్సుని, దేహాన్ని ప్రశాంతంగా ఉంచుకుని, నిశబ్దంగా, | ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఆసనాలు వేయాలి. - గర్భవతిగా ఉన్నప్పుడు, ఋతుస్రావ సమయంలో, మరేదైనా.......... ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడూ లో